Tenses Introduction
In this blog I am going to discuss about one of the important topic tenses.
ఈ రోజు నేను ఈ tenses గురించి విశ్లేషించి వివరించాలని అనుకుంటున్నాను. ఇది మన స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా ప్రముఖమైన పాత్ర కలిగి ఉంది కానీ దీనిని చాలా కష్టతరంగా అని అందరూ భావిస్తూ ఉంటారు ,నిజానికి ఇది చాలా సులభమైన టాపిక్(అంశం) అది ఎలాగో ఈ రోజు మనం తెలుసుకుందాం.
ఈ tense అనే పదం లాటిన్ పదమైన “Tensus “ నుంచి వచ్చింది.
Tenses A Very Important Grammar Topic Explained in Easy Way|| Simple resent part 1||
Tense అంటే ఒక పని ఎప్పుడు ,ఎక్కడ ,ఎలా, ఏ కాలంలో జరగబడిందో తెలుపుతుంది.
మనకు ముఖ్యంగా మూడు కాలాలు(times) ఉంటాయి వాటిలో
1. భూతకాలం లేదా జరిగిపోయిన కాలం(past Tense ):దీనిలో జరిగిపోయిన విషయాలు గురించి మాట్లాడుతాం
2.వర్తమాన కాలం లేదా జరుగుతున్న కాలం(present Tense ): దీనిలో ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుతూ వుంటాం
కానీ ఈ present Tense కి past Tense మరియు future Tense ల తో కొంచెం సంబంధం ఉంటుంది.
3.భవిష్యత్ కాలం లేదా జరగబోయే కాలం (future Tense)
మనకు ఈ మూడు Tense లు ఉంటాయి ,ఈ మూడుTense లను main Tense అంటారు.
ప్రతి main Tense లో నాలుగు sub tense లో ఉంటాయి
4 Sub Tenses:
- Simple
- Continuous
- Perfect
- Perfect continuous
Past tense
- Simple past
- past continuous
- past perfect
- past perfect continuous
Present tense
- simple present
- Present continuous
- present perfect
- present perfect continuous
Future tense
- Simple future
- future continuous
- future perfect
- future perfect continuous
ఇలా మొత్తం మనకు 12 tenses ఉంటాయి
- Present tense -4
- past tense -4
- future tense -4
All 12 tenses
Simple Present
ఇప్పుడు మనం simple present గురించి తెలుడ్సుకుందాం .
మనం ఈ simple present రాయాలంటే మనకు దాని “structure” ముందుగా తెలియాలి
subject +helping verb+ main verb +object
మనం simple present ను ఎప్పుడు వాడతాం అంటే అలవాటుగా చెసే పనులుకు(habitual Actions ) ,రోజు చేసే పనులుకు(daily Activities ) ,universal truths (విశ్వ సత్యాలగురించి ) కు మనం ఉపయోగిస్తాం.
దీనిలో positive ,positive questions, negative, negative questions వుంటాయి
Simple present positive :
simple present:{subject +V 1(s /es )+object } positive
subject: I ,We ,You ,He ,She ,It and They మనకు తెలుసు
V 1(s /es){verb అంటే క్రియలు}
“ఈ V 1(s /es) అనేది simple present positive structure లో మాత్రమే వస్తుంది మరెక్కడా రాదు”
V 1(s /es) ఎక్కడ వాడాలి అంటే ,ఇచ్చిన subject … third person singular అయితే
అంటే ,He ,She ,It లేదా పేర్లు వచ్చినట్లైతే ,V 1(s /es) main verb కి వస్తుంది
- I practice English daily .నేను ప్రతిరోజూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తుంటాను .
- We go to library daily .మేము ప్రతిరోజూ లైబ్రరీ కి వెళతాం .
- We go to book shop daily.మేము ప్రతి రోజు బుక్ షాప్ కి వెళుతుంటాం.
- They always speak in English.వాళ్ళు ప్రతి రోజూ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వుంటారు .
- He play(s) chess daily .అతను పతి రోజు చెస్ ఆడుతూ ఉంటాడు.
He అనేది third person singular కాబట్టి last లో” S “వచ్చింది
- she goes to temple regularly .ఆమె రోజూ గుడికి వెళుతూ ఉంటుంది .
She అనేది third person singular కాబట్టి last లో” ES “వచ్చింది
- PV Sindhu practices badminton daily. పీ .వీ సింధు ప్రతి రోజు బ్యాట్మెంటన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది.
PV Sindhu అనేది third person singular కాబట్టి last లో” ES “వచ్చింది
Tenses A Very Important Grammar Topic Explained in Easy Way|| Simple resent part 1||
Simple present positive question:
simple present:{Do /Does(helping verb)+ subject +V 1+object } positive question
Do= I ,we, you, they
Does =he, she ,it ,names
- Do I practice English daily .నేను ప్రతిరోజూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తుంటానా .
- Do we go to library daily .మేము ప్రతిరోజూ లైబ్రరీ కి వెళతామా .
- Do we go to book shop daily.మేము ప్రతి రోజు బుక్ షాప్ కి వెళుతుంటామా .
- Do they always speak in English.వాళ్ళు ప్రతి రోజూ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వుంటారా .
- Does he play chess daily .అతను పతి రోజు చెస్ ఆడుతూ ఉంటాడా .
- Does she goes to temple regularly .ఆమె రోజూ గుడికి వెళుతూ ఉంటుందా .
- Does PV Sindhu practices badminton daily.పీవీ సింధు ప్రతి రోజు బ్యాట్మెంటన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందా.
ఇప్పుడు మనం simple present లోpositive ,positive questions గురించి తెలుసుకున్నాం .
తరువాత పోస్ట్ లో simple present లో negative, negative questions గురించి తెల్సుకుందాం .
For more grammar topics please click: DIRECT and INDIRECT SPEECH